ఆదిలాబాద్ :
పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో విదులు నిర్వహించే కానిస్టేబుల్ రాజేశ్వర్ ఓ ఒంటరి మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
SI శంకర్ తెలిపిన వివరాల ప్రకారం…
పెంబి మండలంలోని ఇటీక్యాల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ జవ్వాజి రాజేశ్వర్ కొంతకాలంగా ఖానాపూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వివాహిత భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా పట్టణంలో నివాసం ఉంటుంది. రాజేశ్వర్ సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ గర్భం దాల్చింది. దీంతో 15 రోజుల క్రితం అబార్షన్ చేయించాడు. అప్పటి నుంచి పట్టించుకోకపోవడంతో బాధితురాలుగురువారం తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.
రాజేశ్వర్ నిరాకరించడంతో పట్టణంలోని విద్యానగర్‌లో ఉండే తన ఇంట్లో ఎలుకల మందు తాగింది. గమనించిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం నిర్మల్‌కు తరలించగా అక్కడి నుంచి జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు