ఫొన్లు తెరవాలి రండి… MLC కవితకు ట్విస్ట్… ED ఆఫీసుకు సోమా భరత్

ఫోన్లు ఓపెన్ చేయాలి.. రమ్మంటూ MLC కవితకు ED పిలుపు… ప్రతినిధిగా హాజరైన సోమ భరత్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కు సంబంధించిన ఫోన్లను ఓపెన్ చేయాలని అందుకు కవిత లేక ఆమె ప్రతినిధిని పంపించాలని నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో కవిత తరపున ఆమె ఆథరైజ్డ్ ప్రతినిధిగా లీగల్ అడ్వైజర్ సోమ భరత్ ఈడి విచారణకు హాజరయ్యారు.

కవిత ఫోన్లలో డేటా రికవరీ కోసం ఆమెను లేదా ఆమె ప్రతినిధిని హాజరు కావాలంటూ సోమవారం సాయంత్రం ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత లీగల్ అడ్వైజర్ సోమ భరత్ ఆమె తరపున మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.

కవిత ఇప్పటికే ఈనెల 11, 20, 21 తేదీల్లో ఈడీ విచారణకు హాజరైంది. 11వ తేదీ విచారణ సందర్భంగా కవిత పర్సనల్ ఫోన్ను ఈడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు . 21వ తేదీన కవిత ఇడికి 9 ఫోన్లు అప్పగించింది.

ఇప్పుడు ఆ ఫోన్లో లోనీ డేటాను ఓపెన్ చేసేందుకు కవితను, లేదా ఆమె ప్రతినిధిని పంపించాలని నోటీసులు ఇవ్వగా ఆమె తరపున సోమ భరత్ హాజరయ్యారు . కవిత ఫోన్ లో డేటా ఓపెన్ చేసి నట్లయితే ఈ కేసులో కవిత పాత్ర పై మరిన్ని ఆధారాలు, స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈడి అధికారులు భావిస్తున్నారు.