దళిత బంధు పై SC కార్పొరేషన్ అధికారులతో SC సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష సమావేశం…
హాజరైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎండీ, ఇతర ఉన్నతాధికారులు.
దళిత బంధు అమలు పై అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
గ్రౌండ్ లెవల్ లో తిరిగి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశం.
కింది స్థాయి లో దళిత బంధులో అక్రమాలు అక్రమాలు జరుగుతున్నాయని వెంటనే అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి.
ఎస్సి కార్పొరేషన్ ఇడి లు ఫీల్డ్ లో తిరిగాలి లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
లబ్ధిదారులకు అందించిన ప్రతిదీ పక్కాగా నడవాలి.
నెల నెలా ఎంత ఆదాయం వస్తుందో కూడా తెలుసుకోవాలి,పక్కాగా నమోదు చేయాలి.
దళిత బంధులో అమలు చేస్తున్న కొన్ని స్కీమ్స్ లు అద్భుతంగా ఉన్నాయి అలాంటి స్కిం ల గురించి ఆలోచన చేయాలి.ఇప్పటివరకు ఇచ్చిన దళిత బంధు స్కిం విజయవంతంగా నడుస్తున్న వాటిపై అవగాహన పెంచి అలాంటి వాటిని ఎక్కువ లబ్ధిదారులకు వచ్చేలా చూడాలి.
దళిత బంధు కింద అందజేసిన యూనిట్స్ ఎక్కడ కూడా ఫెయిల్ కావద్దు జగ్రత్తగా అందజేయాలని కోరిన మంత్రి.
ఆవులను, బర్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వాటి పెంపకంపై ఎప్పటికప్పుడు పశు వైద్యుల చేత వాటి ఆరోగ్యం పై వైద్యుల సలహాలు సూచనలు చేయాలి.వాటి ఆరోగ్యంపై కూడా లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు తెలుపాలి.
బర్లకు ఇచ్చే దాన తోపాటు మంచి పోషకాలు వచ్చే ఆహారం అందియ్యాలి.
దళిత బంధు విజయవంతం కోసం నిరంతరం క్షేత్ర స్థాయిలో అధికారులు పని చేయాలి -మంత్రి కొప్పుల ఈశ్వర్.