రామగుండం పోలీస్ కమిషనరేట్…
భర్త ను హత్య చేసిన భార్య అరెస్ట్
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగళ్ల పల్లి కోనూర్ గ్రామం కి చెందిన మృతుడు దుంపటి మహేష్ తండ్రి పోశయ్య ఫిర్యాదు మేరకు ఎస్ ఐ విజేందర్ దేవాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
దర్యాప్తు లో భాగంగా మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు సీఐ గారు తన సిబ్బంది తో కలిసి వెళ్లి కాసిపేట మండలం లోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండాపూర్ (యాప) బస్టాండ్ దగ్గర లో నిందితురాలు దుంపటి లావణ్య ను అదుపులోకి తీసుకోని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కి తరలించడం జరుగుతుంది అని సీఐ మహేందర్ రెడ్డి గారు వెల్లడించారు.
నిందితురాలి వివరాలు…
దుంపటి లావణ్య w/o మహేష్,31yrs, కుమ్మరి, తంగళ్లపల్లి, కోనూర్ గ్రామం, కాసిపేట్ మండలం
వివరాల్లోకి వెళితే…..
నిందితురాలు దుంపటి లావణ్య 14 సంవత్సరాల క్రితం తంగళ్లపల్లి, కోనూర్ గ్రామం కి చెందిన దుంపటి మహేష్ తో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. మృతుడు గత కొన్ని సంవత్సరాల నుండి బాగా తాగుడుకు బానిసై నిందితురాలు లావణ్యను హింసించడం గతంలో రెండు సార్లు కట్టతో తలపై కొట్టడం జరిగింది. అత్తమామలు నిందితురాలికి సర్ది చెప్పినారు. భర్త పెట్టే హింసలు భరించలేక తనను చంపితే తప్ప తనకు మనశ్శాంతి ఉండదని, తన భర్తను ఎలాగైనా చంపాలని అవకాశం కొరకు ఎదురు చూస్తుండగా తేది 26-03-2023 రోజున సాయంత్రం సమయంలో మృతుడు బాగా తాగి వచ్చి నిందితురాలు లావణ్య (భార్య) తో గొడవ పడగా ఇదే సరైన సమయం అని తన భర్తని ఎలాగైనా ఈ రోజే చంపాలని ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారం ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో తన భర్త మృతుడు మహేష్ తల పైన గట్టిగా కొట్టగా తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగి ఇంటి ముందర గద్దెపై చనిపోయినాడు. భర్తను కొట్టిన ఇనుపరాడును ఎవరికి దొరకవద్దని తన ఇంట్లోనే దాచిపెట్టినది. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.