సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల పరీక్ష ఎప్పుడంటే…?
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతోంది.
గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశాలు
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)… 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఏప్రిల్ 30న ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలు తదితరాలు అందిస్తారు.
వివరాలు..
సైనిక పాఠశాల (ఎస్టీ) – ఆరో తరగతి ఇంటర్ ప్రవేశాలు…
అర్హతలు :
ఆరో తరగతికి 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. ఇంటర్‌కు 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
సీట్ల సంఖ్య… ఆరో తరగతి- 80 సీట్లు, ఇంటర్- 80 సీట్లు.
వయో పరిమితి (31.03.2023 నాటికి ) : ఇంటర్‌కు 01.04.2006 – 31.06.2008 మధ్య జన్మించి ఉండాలి.
ఆరో తరగతికి 01.04.2011 – 31.03.2013 మధ్య జన్మించి ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.200.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా…
ఎంపిక విధానం: రాతపరీక్ష, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
రాతపరీక్ష విధానం : ఆరోతరగతి రాత పరీక్ష అయిదో తరగతి స్థాయిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్(30 మార్కులు), మ్యాథ్స్(30 మార్కులు), సైన్స్(10 మార్కులు), సోషల్ స్టడీస్(10 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ రాత పరీక్ష 8-10వ తరగతి స్థాయిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(40 మార్కులు), ఫిజిక్స్(20 మార్కులు), కెమిస్ట్రీ(15 మార్కులు), బయాలజీ(5 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 08.04.2023.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 23.04.2023 నుంచి.
ప్రవేశ పరీక్ష తేదీ: 30.04.2023.
ప్రవేశ పరీక్ష ఫలితాలు: 05.05.2023.
ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష తేదీలు: 08.05.2023 నుంచి 13.05.2023 వరకు.
సైనిక పాఠశాలలో ప్రవేశాల తేదీ: 12.06.2023.