తలపై గంగను మొస్తున్నా నాలుక కూడా తడపడం లేదు అంటున్న జూరాల గ్రామ ప్రజలు

తలపై గంగను మొస్తున్నా నాలుక కూడా తడపడం లేదు అంటున్న జూరాల గ్రామ ప్రజలు

లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు ఈసారి తమ నీడలో బ్రతికే రైతన్నల పొట్ట కొట్టనుంది.

జూరాల ప్రాజెక్టు D6 కెనాల్ క్రింద పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు నీరు వదలం అన్న చేదు వార్త వారి గుండెల్లో భారాన్ని నింపింది.

ఊరిలో పైబాగాన కృష్ణమ్మ పరుగులిడుతుంటే ఎడమ వైపు జెన్కో ప్రాజెక్టు కళ్లముందు కాల్వలు కూత వేటు దూరంలో రామన్పాడ్ ప్రాజెక్టు చుట్టూ జలనిధులు ఉన్నా వ్యవసాయ సాగుకు ఈసారి నీలందే పరిస్థితి లేనట్టే వుంది.

కృష్ణమ్మ చెంతనున్నా పంటలకు నీళ్ళు అందడం లేదు కనీసం వారి భూముల్లో వేసుకున్న బోర్లు కూడా ఎండి పోయే పరిస్థితి ఏర్పడనుంది.

D6 కెనాల్ కాల్వలకు కనీసం ఒక అడుగు మేర నీరు వదిలినా వారి బావుల బోర్లు రీఛార్జ్ అవుతాయని.

కనీసం ఆ బోర్ల ద్వారనైనా పంటలు లేదా కూరగాయలు పండించుకోవచ్చని జూరాల గుంటిపల్లి ఆరేపల్లి కాల్వలపై ఆధారపడ్డ ఆయా గ్రామాల రైతన్నలు అంటున్నారు.

స్థానిక అధికారులు చొరువ తీసుకుని కనీసం కొద్ధిపాటి నీరు అందించేలా తమపై అధికారులతో మాట్లాడి రైతన్నలకు అండగా నిలబడాలని ఆయా గ్రామాల రైతన్నలు కోరుతున్నారు.

ఇన్నాళ్ళు నీళ్లకు ఎలాంటి కరువు లేదని ఈసారి వర్ష శాతం సాధారణ స్థితిలో నమోదు కావడంతో మండే ఎండలతో నీటి ఎద్ధడి ఏర్పడవచ్చని అలాంటి పరిస్థితుల్లో రైతన్నల పట్ల కటినమైన నిర్ణయాలు తీసుకోకుండా కాల్వల ద్వారా నీరు అందించాలని అపుడప్పుడు పూర్తి స్థాయిలో నీరందించాలని రైతన్నలు కోరుతున్నారు.