హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై CM రేవంత్‌ సమీక్ష… కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై CM రేవంత్‌ సమీక్ష… కీలక ఆదేశాలు.

హైదరాబాద్‌ :

హైదరాబాద్‌ మెట్రో రైలుపై కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు సెక్టార్లలో రాజధానిలో మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేస్తుంది సర్కార్‌..

ఈ క్రమంలో మెట్రో రైలు విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మెట్రో రైలు పొడిగింపుపై సీఎం రేవంత్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు..

అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై త్వరగా డీపీఆర్‌, ట్రాఫిక్‌ స్టడీస్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు(14 కి.మీ), రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్(12 కి. మీ), ఎంజీబీఎస్‌ నుంచి ఎయిర్‌పోర్టు (23 కి.మీ), ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌( 8 కి.మీ) మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని స్పష్టం చేశారు..