ధనం మీద ఆశతో కిరాతకుడిగా మార్చేస్తున్నాయి. హత్యలకు దారి తీస్తున్నాయి ఇలాంటి ఘటనలు తరచు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే హత్య చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కనిపెంచినటువంటి తల్లిని మరిచి ఆస్తి కోసం తల్లిని చంపేసాడు కొడుకు. ఈ ఘటన రామంతపూర్ లో చోటుచేసుకుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు.. డబ్బు దీని కోసం ఎంతటి పనికి అయినా సిద్ధమవుతున్నారు కొందరు వ్యక్తులు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు అని తేడా లేకుండా డబ్బుకు బానిసై హత్యలు దాకా వెళ్తున్నారు. అప్పటివరకు ఉన్నటువంటి బంధాలను పక్కకు పెట్టి ధనం మీద ఆశతో కిరాతకుడిగా మార్చేస్తున్నాయి. హత్యలకు దారి తీస్తున్నాయి ఇలాంటి ఘటనలు తరచు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే హత్య చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కనిపెంచినటువంటి తల్లిని మరిచి ఆస్తి కోసం తల్లిని చంపేసాడు కొడుకు. ఈ ఘటన రామంతపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రామంతపూర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని భార్యతో కలిసి కొడుకు అనిల్ హత్య చేశాడు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో కొడుకు కోడల బండారం బయటపడింది. దీంతో బంధువులు ఉప్పల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా తల్లిని చంపిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు.
రామంతపూర్ లో నివాసం ఉంటున్న సుగుణమ్మ.. కొడుకు అనిల్ కోడలు తిరుమలతో ఉంటుంది. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని చూశారు కొడుకు కోడలు. అయితే సుగుణమ్మ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో భార్య స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు కొడుకు అనిల్. ఆ తర్వాత తన తల్లి చనిపోయినట్లు డ్రామా ఆడిన గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలను చేయాలనీ చూశాడు. బంధువులకు అనుమానం రావడంతో కొడుకు అసలు గుట్టంతా బయటపడింది. దీంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు కొడుకు అనిల్ ను కోడలు తిరుమలను మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన వీడు కొడుకు కాదు కసాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.