44 వేల కోట్లకుపైగా GST ఎగవేత… ప్రత్యేక డ్రైవ్‌లో వెలుగు చూసిన నిజాలు
భారతదేశంలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చి ఆరున్నరేళ్లు అవుతున్నా, దేశంలో పన్ను ఎగవేత కేసులు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి.
మే 2023 నుండి GST అధికారులు పన్ను ఎగవేతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఇందులో రూ. 44,015 కోట్ల విలువైన GST ఎగవేతను గుర్తించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇది కాకుండా, దేశవ్యాప్తంగా నకిలీ జీఎస్టీ చెల్లింపులదారులపై నిఘా వేశారు అధికారులు. ఈ డ్రైవ్‌లో 29,273 బోగస్ సంస్థలు అనుమానాస్పద పన్ను క్రెడిట్ ఎగవేతలో పాల్గొన్నాయని 121 మందిని అరెస్టు చేశాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
GST ఎగవేత కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానం.