ఆదిలాబాద్ :
చీరతో ఫ్యాన్‌కు ఊయల కట్టి సరదాగా ఆడుకుంటున్న ఓ చిన్నారికి ఉరి పడి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్‌రూరల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన కొడప జంగు–లక్ష్మి దంపతులకు కూతురు విజయలక్ష్మి(13), కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ చేనుకు పత్తి ఏరేందుకు వెళ్లారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విజయలక్ష్మి ఇంట్లో తన మిత్రులతో కలిసి ఫ్యాన్‌కు ఊయలగా చీర కట్టుకుని సరదాగా ఆడుకుంటుంది. ఈ క్రమంలో చీర బాలికకు ఉరిగా బిగుసుకోవడంతో ఊపిరాడక మృతి చెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, బాలిక చించుగాడ్ ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది