మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సింధు, నాగార్జునలు అచ్చంపేటలో జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తలు మధ్య తరచూ గొడవపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గత రాత్రి సింధు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముందుగా నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో మార్గమధ్యలోని సింధు మృతి చెందింది.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందుకు ఆమె భర్తే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తను కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సింధు, నాగార్జునలు అచ్చంపేటలో జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తలు మధ్య తరచూ గొడవపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గత రాత్రి సింధు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముందుగా నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో మార్గమధ్యలోని సింధు మృతి చెందింది.
సింధు మరణాన్ని జీర్ణించుకోలేకపొయిన కుటుంబ సభ్యులు, బంధువులు:
సింధు మరణించిన విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలవడంతో ఆగ్రహంతో సింధు భర్త నాగార్జునను అదుపులోకి తీసుకొన్నారు. కొంత దూరం వెళ్ళాక నాగార్జునపై తీవ్రంగా దాడి చేశారు. నీ వల్లే సింధు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అర్ధరాత్రి ఇనుపరాడ్లు, కర్రలతో ఆమనగల్ వద్ద నాగార్జున ను కొట్టిచంపారు. కల్వకుర్తి ఆసుపత్రిలో నాగార్జున మృతదేహం లభ్యమైంది.
సింధు ఆత్మహత్యాయత్నానికి వేధింపులే కారణమా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న సింధు, నాగార్జునలకు గడచిన కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కట్నం కోసం నాగార్జున వేధించారని సింధు కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. పెళ్ళైన నాటి నుంచి తన కూతురిపై అనేక రకాల ఆంక్షలు పెట్టి చిత్రహింసలు పెట్టారని తెలిపింది. తన బిడ్డ మృతికి భర్త బంధువులు డాక్టర్ కృష్ణ, అతని భార్య కారణం అంటూ సింధు తల్లి కన్నీరుమున్నీరవుతోంది.