తెలుగు రాష్ట్రాలలో జోరుగా కోడిపందాలు…
కోనసీమ జిల్లా :
సంక్రాంతి వచ్చింది. కోళ్ల పందేలు తెచ్చింది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందేలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి.ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక లెవెల్‌కు వెళ్లాయి.
గత ఏడాది కోడి పందేలు, గుండాటలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడంతో పందెం రాయుళ్లు ఆనందంతో పొంగిపోయారు. కాయ్ రాజా కాయ్ అంటూ కోట్ల రూపాయల పందేలు కాశారు.
కోనసీమ జిల్లా అమలా పురం, ఉప్పల గుప్తం, అల్లవరం మండలాల్లో కోడిపందేల బరులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక కోడి పందేల ముసుగులో గుండాటలు కూడా జోరుగా జరుగుతున్నాయి.
ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 250 చోట్ల కోడి పందేలు జరుగుతున్నాయి. భారీగా నగదు చేతులు మారుతోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. చీకటి పడ్డా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పందెం రాయుళ్లు తగ్గేదే లా అంటూ పందేలు కాస్తున్నారు.
ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరూ కోళ్లు, క్రాస్ బ్రీడ్ కోళ్లతో పందేలు వేస్తున్నారు పందెం రాయుళ్లు. పెరూ కోళ్లతో లోకల్ కోళ్లు చూసుకుందాం రా అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజ కవర్గం కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు జరుగుతున్నాయి. పోలీస్ ఆంక్షలు బేఖాతర్ అయ్యాయి.
గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర నెక్ట్స్ లెవెల్‌కు చేరింది. మనల్నెవడ్రా ఆపేది.. అంటూ కత్తులు కట్టుకుని కాలుదువ్వుతున్నాయి
పందెం కోళ్లు. దెందులూరు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డి గూడెం.. ఇలా అనేక చోట్ల బరులు సిద్ధ చేసి తగ్గేదే లే అంటున్నారు. కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులే తొలి పందేన్ని ప్రారంభించారు