న‌డిరోడ్డుపై బైక్‌పై దూసుకెళ్తూ.. జంట‌ రొమాన్స్‌

ఆధునిక పోడల పేరుతో యువత వెకిలి చేష్టలకు పాల్పడటం నెట్టింట చర్చను రేకెత్తిస్తున్నది.

ముంబై :

ప‌ట్ట‌ప‌గ‌లు.. న‌డిరోడ్డుపై ఓ జంట రొమాన్స్‌తో పిచ్చెక్కించారు. అది కూడా బైక్‌పై దూసుకెళ్తూ ముద్దుల్లో మునిగిపోయారు. కౌగిలింత‌ల‌తో ప‌ర‌వ‌శించిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ముంబైకు చెందిన ఓ జంట బంద్రా రిక్ల‌మేష‌న్ రోడ్డుపై స్కూటీపై వేగంగా వెళ్తున్నారు. ఇక ప్రియుడు డ్రైవింగ్ చేస్తుండ‌గా, ప్రియురాలు అత‌నికి ఎదురుగా కూర్చుంది. ఆ ప్రేమికులిద్ద‌రూ ఒకే శాలువాలో ఒదిగిపోయారు. ఇంకేముంది ముద్దుల్లో మునిగిపోయి, కౌగిలింత‌ల్లో ప‌ర‌వ‌శించిపోయారు. ఆ జంట రొమాన్స్‌ను అటుగా వెళ్తున్న ఇత‌ర వాహ‌న‌దారులు త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. అయితే ఈ జంట రొమాన్స్‌పై వాహ‌న‌దారులు, నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ప‌బ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం త‌గ‌ద‌న్నారు. ఈ ప్రేమికుల‌పై ముంబై పోలీసులు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు.