మాజీ CM KCR ఫామ్ హౌస్ కే పరిమితమా…?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ పంటలు పండించనున్నా రని తెలిసింది.
ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమా నికి ఫోన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
ఇటీవల తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిపాలైన కేసీఆర్ కు వైద్యులు ఆపరేషన్ చేసిన అనంతరం జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో ఉన్న సొంతింట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
మరో వారం పది రోజుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్ కు వస్తానని ఆయనే స్వయం గా ఈ ఫోన్ కాల్ లో చెప్పారు.సిద్ధిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలోని ఓ ఫర్టిలైజర్ షాపు యజమానికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి, ఈసారి ఫాంహౌస్ లో బొప్పాయి, పుచ్చకాయ, ఇతరత్రా పంటలు సాగు చేద్దామని అనుకున్నట్లు చెప్పారు.
వ్యవసాయ పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని వివరించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను రెండు మూడు రోజుల్లో ఫాంహౌస్ కు పంపించాలని ఆ ఫర్టిలైజర్ షాపు యజమానికి సూచించారు.
చివరగా మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్.. అని అడగగా ఇప్పుడు అంతా బాగుందని, కోలుకున్నానని, త్వరలో ఫాంహౌజ్ కి రాబోతున్నట్లు కేసీఆర్ బదులిచ్చారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు లోక్ సభ ఎన్నికల పరిస్థితి ఏంటీ సార్, రాజకీయ సన్యాసం తీసుకుంటు న్నారా ? అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.