నేడు అయోధ్య కు చేరునున్న రాములోరి విగ్రహం

నేడు అయోధ్య కు చేరునున్న రాములోరి విగ్రహం…

ఉత్తర ప్రదేశ్ :

అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్ లల్లా విగ్రహం బుధవారం నాడు అయోధ్యకు చేరుకుం టుంది.

మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్యకు వస్తుం ది. విగ్రహ ప్రతిష్ఠాపన కు సంబంధించిన పనులు మంగళవారం నుంచి మొదలయ్యాయి.

రామమందిరం గురించి, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవాలను కునే భక్తుల కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దివ్య్ అయోధ్య’ యాప్ రూపొందించింది

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం రూపొందించిన ఆహ్వాన పత్రాలు అందరినీ ఆకట్టు కుంటున్నాయి. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించ బోయే బాలరా ముడి విగ్రహ రూపాన్ని ఆహ్వాన పత్రికలపై ముద్రించారు.

అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. దీనికి నిషాద్ రాజ్ అతిథిగృహం అని నామకర ణం చేసింది. ఇందులో వేసిన గుడారాల్లో అతిథులు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.