12 లక్షల కోసం తల్లిని చంపి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచిన కూతురు… నేరం రుజువు.. 26 ఏళ్లు జైలు శిక్ష

అమెరికాలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల హీథర్ మాక్ తన ప్రేమికుడితో కలిసి తన తల్లిని హత్య చేసి, ఆపై ఆ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టింది. ఇలా తల్లిని హత్య చేసినప్పుడు కూతురు మాక్ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అంతేకాదు.. అప్పుడు ఆమె గర్భవతి అని దర్యాప్తులో తేలింది. మాక్ తన ప్రేమికుడు టామీ స్కేఫర్‌తో కలిసి 1.5 మిలియన్ డాలర్స్ అంటే మన దేశ కరెన్సీలో 12,46,88,475.00 ట్రస్ట్ ఫండ్ కోసం తన తల్లిని చంపింది.

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పిన విషయాలను రుజువు చేస్తూ.. ప్రపంచంలో అనేక నేరాలకు కారణం డబ్బులు, ఆస్తులే అవుతున్నాయి. రక్త సంబంధం కూడా నోట్ల కట్టల ముందు వెలవెలబోతుంది. తరచుగా గుండెలు పిండేసే హత్య కేసులు ప్రపంచంలో ఎక్కడోచోట వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో అమెరికాకు చెందిన ఒక సంపన్న మహిళ షీలా వాన్ వైస్ మాక్ బాలి లో హత్య జరగడంతో సంచలనం సృష్టించింది. అది కూడా ఆమె సొంత కూతురు ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ కేసులో 28 ఏళ్ల హీథర్ మాక్‌కు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుత ప్రపంచంలో ఏ బంధం, సంబంధంలోనూ స్వచ్ఛత లేదు. అందుకు తల్లీ కూతుళ్ల సంబంధం కూడా మినహాయింపు కాదు అని కొంతమంది కూతుర్లు తరచుగా రుజువు చేస్తున్న ఘటనల గురించి వింటూనే ఉన్నాం.. డబ్బు ముందు రక్త సంబందానికి కూడా విలువ లేదు. అగ్రరాజ్యం అమెరికాకి చెందిన ఓ కూతురు తన తల్లిని డబ్బు కోసం బాలిలో చంపిన కేసు మళ్ళీ వార్తల్లో నిలిచింది. తన కూతురిని ఎంతో ప్రాణప్రదంగా పెంచిన తల్లిని డబ్బుకోసం ప్రియుడితో కలిసి కూతురు చంపెయ్యడమే కాదు.. తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచింది కూడా..

అసలు విషయం ఏమిటంటే…

అమెరికాలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల హీథర్ మాక్ తన ప్రేమికుడితో కలిసి తన తల్లిని హత్య చేసి, ఆపై ఆ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టింది. ఇలా తల్లిని హత్య చేసినప్పుడు కూతురు మాక్ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అంతేకాదు.. అప్పుడు ఆమె గర్భవతి అని దర్యాప్తులో తేలింది. మాక్ తన ప్రేమికుడు టామీ స్కేఫర్‌తో కలిసి 1.5 మిలియన్ డాలర్స్ అంటే మన దేశ కరెన్సీలో 12,46,88,475.00 ట్రస్ట్ ఫండ్ కోసం తన తల్లిని చంపింది. మొదట మాక్ తన తల్లి అరవకుండా నోటిని కట్టివేయగా.. అనంతరం ఆమె తలపై మాక్ ప్రియుడు స్కేఫర్ గట్టిగా కొట్టాడు. హోటల్‌లో తల్లిని హత్య చేసిన అనంతరం మాక్ , ఆమె ప్రేమికుడు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి టాక్సీలో వదిలి వెళ్లారు. సూట్‌కేస్‌లో మృతదేహం అవశేషాలను పోలీసులు గుర్తించారు.

హీథర్ మాక్‌కు 26 ఏళ్ల శిక్ష…

2014లో బాలిలో జరిగిన ఈ ఘటనలో దోషిగా తేలిన తర్వాత.. హీథర్ కు 26 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. హీథర్ 2015లో ఇండోనేషియాలో దోషిగా నిర్ధారించబడింది. 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అయితే ఆమె 2021లో విడుదలైంది. అనంతరం హీథర్ అమెరికా చేరుకున్న తర్వాత మళ్ళీ అరెస్ట్ అయింది. ఒక అమెరికన్ వ్యక్తిని హత్య చేసిన నేరంపై హీథర్ మాక్ గత రెండు సంవత్సరాలుగా శిక్ష కోసం చికాగో జైలులో గడిపింది. ఆమె ప్రియుడు ప్రస్తుతం ఇండోనేషియా జైలులో ఖైదు చేయబడ్డాడు.