సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు… జగిత్యాల జిల్లా అదనపు SP ప్రభాకర రావు

జగిత్యాల జిల్లా….

సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు: జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ప్రభాకర రావు గారు.

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి.

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లా పరిధిలో ఇప్పటివరకు పోగొట్టుకున్న,చోరికి గురైన 198 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 32 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ…

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 లక్షల విలువ గల 198 మొబైల్ ఫోన్స్ ఈ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మొబైల్ నెంబర్ ,మీ సేవ రసీదు, IMEI మొదలగు వివరాలతో ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. ఇలా నమోదు చేయడం IMEI ద్వారా ఫోన్ బ్లాక్ చేయబడి పనిచేయదు అన్నారు. ఇందులో ఎవరైనా సిమ్ కార్డ్ వేసుకుంటే ట్రేస్ రిపోర్టు వస్తుందని దీని ఆధారంగా పోయిన మొబైల్ లొకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఫోన్ లభించిన తర్వాత అదే వెబ్సైట్లో కి వెళ్ళి అన్ బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్,RSI దినేష్ , కృష్ణ మరియు సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించారు.

ఈ యొక్క కార్యక్రమంలో SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు,RI జనిమియా , RSI లు దినేష్, కృష్ణ మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.