హైదరాబాద్‌ అంబర్‌పేటలో దారుణం… ప్రేమోనాద్మం విషాదాంతం! పుట్టినరోజే పట్టాలపై…

హైదరాబాద్‌ :

అంబర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలుడు(16) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించాలని బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై తేలాడు. విద్యానగర్‌ పట్టాలపై తల లేకుండా మొండంతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను ప్రేమించాలంటూ సదరు బాలుడు వెంటపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అతని పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ఆమె సమక్షంలో కేక్‌ చేయాలని ఆశపడ్డాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో గురువారం సాయంత్రం ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన మరో బాలికను గాయపర్చాడు. దీంతో వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు ఘటన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.