జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా :

జగిత్యాల జిల్లా బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకై ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు,

10 ఏండ్ల లో ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారు.

రైతులు నారు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు.

రైతు బంధు, రైతు సంక్షేమం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ లది విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇచ్చిన వాగ్దానాలు తప్పించునే యత్నంలో కాంగ్రెస్ సర్కారు ఉంది.

ఆరు గ్యారెంటీల అమలుకు మార్చి 17 తేదీ తో 100 రోజులు నిండుతాయి…

లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి….

ఎన్నికల కోడ్ పేరు తో ఆరు గ్యారెంటీల నుండి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.

ఆరు గ్యారెంటీల పై అభయ హస్తం పేరు తో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర లో ప్రజల నుంచి కుటుంబ పూర్తి వివరాలతో దరఖాస్తులు తీసుకుని, ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది,

ఈ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్లు, మళ్ళీ సర్వే ఇందుకు నిర్వహిస్తుట్టు….

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం,

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, ఈ కాళేశ్వరం నిర్మించింది ప్రఖ్యాత ఎల్ అండ్ టీ కంపెనీ.

మేడిగడ్డ బ్యారేజీలోని 7‌వ బ్లాక్ లో 20.వ పిల్లర్ కుంగడంతో పక్కనే ఉన్న 19, 21, పిల్లర్ల పై భారం పడింది,

ఈ మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్ తో తొలగించి తిరిగి నిర్మిస్తే సరిపోతుందని ENC పేర్కొంది.

పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలసింది పోయి మంత్రులు మేడిగడ్డ పర్యటనలు చేస్తూ విచారణ పేరుతో మరమ్మతు పనులను ప్రభుత్వం జాప్యం చేస్తున్నది..

ఈ క్రమంలో బ్యారేజీ పై రోజుకో అసత్య ప్రచారం తెరపైకి తెస్తున్నారు..

ఇప్పటి వరకు ప్రాజెక్ట్ లపై విజిలెన్స్ కమిటీ ఎందుకు వేయలేదు , బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ప్రతి బీఆర్ ఎస్ కార్యకర్తకు అండగా ఉంటాం, ఏ ఒక్కరిపై అక్రమ కేసు బనాయించిన ఎదుర్కొని పోరాడుతాం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, డా.కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పి చైర్ పర్సన్ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పి వైస్ చైర్మన్ హరి చరణ్ రావు పాల్గొన్నారు.