2024 ఎన్నికల ట్యాగ్‌లైన్ లోగోను విడుదల చేసిన EC
న్యూ ఢిల్లీ :
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది..
ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని గురువారం ఆవిష్కరించింది.
ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్'( ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించాల్సి ఉంది.