బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా❓️

బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా❓️

బీహార్ :

బీహార్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు వుండగా మెజారిటీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం ఆర్జెడి – 79 , బీజేపీ – 78 , జెడియు – 45 , కాంగ్రెస్ – 19 , ఎంఐఎం -1 కమ్యూనిస్టుపార్టీ – 16, HAM (S) – 4 , ఇండిపెండెంట్ -1 బలాబలాలు వున్నాయి.

పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ తో వెళతారని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది.

లాలూ యాదవ్ నేతృత్వం లోని ఆర్‌జెడితో కూడిన మహాఘటబంధన్ మహాకూటమి ప్రభుత్వం నుండి నితీష్ కుమార్ విడిపోయి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో తిరిగి చేరడంపై ఊహా గానాలు చెలరేగుతు న్నాయి.

జెడి(యు)-బిజెపి కూటమికి (45+78 = 123) ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయవచ్చని, బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ తిరిగి డిప్యూటీగా వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.