పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ… 220 మంది చిన్నారులు మృతి

లాహోర్ :

పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ… 220 మంది చిన్నారులు మృతి

పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ కొనసాగుతోంది.

పంజాబ్ ప్రావిన్సులో గత మూడు వారాల్లో 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

అతిశీతల వాతావరణం కారణంగా ఈ మరణాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది

ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహారలోపం, న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

పంజాబ్ ప్రావిన్సులో జనవరి 1 నుంచి 10వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి.

220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

వీరంతా ఐదేళ్ల లోపు పిల్లలే.

లాహోర్లోనే 47 మంది చనిపోయారు’ అని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది.

పంజాబ్ ప్రావిన్సులో గతేడాది 990 మంది న్యుమోనియాతో చనిపోయినట్లు తెలిపారు.

న్యుమోనియాకు బ్యాక్టీరియా, వైరస్ కారణమని.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి రక్షణ ఉంటుందని స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు.

అయినప్పటికీ వైరల్ న్యుమోనియా సోకే ప్రమాదం ఉందన్నారు.

ఇప్పటికే పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీపై నిషేధం విధించామన్నారు.

కొవిడ్-19 మాదిరిగా వేగంగా వ్యాపిస్తుందన్నారు.