వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో తనకు న్యాయం చేయాలని పయ్యావుల వినోద్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆందోళన కు దిగాడు. ఇటీవల కాలంలో వినోద్ భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. భర్త వినోద్ కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే మరణించిందని మృతురాలి బంధువులు…
తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కొందరు సెల్ టవర్లు ఎక్కి నిరసన తెలపడం ఇటీవల పరిపాటుగా మారింది. కొందరు అధికారుల ఒత్తిడి కారణంగా ఇలాంటి పనుల చేస్తే మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. తన కుమారుడికి అన్యాయం జరుగుతోందంటూ ఓ భర్త సెల్ టవర్ ఎక్కిన నిరసన తెలిపాడు. ఈ అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఈ విషయాన్ని గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని వినోద్ కుమారుని సంరక్షణ కోసం ఆరు లక్షలకు ఒప్పందం చేసుకొని వినోద్ దగ్గర నుంచి తీసుకున్నారు.
కానీ ఆ డబ్బులను కుమారుడి పేరు మీద వేయకుండా వినోద్ భార్య తాత వెంకయ్య పేరు మీద బ్యాంకు లో డిపాజిట్ చేశారు. అయితే తన కుమారుడి పోషణ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తు వినోద్ సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. తమ గ్రామానికి చెందిన పెద్దమనుషులే కావాలని తనను ఇబ్బందులు పెట్టి తనను మోసం చేశారని తన కుమారుడుకి న్యాయం చేయాలని, లేకపోతే కిందికి దిగేది లేదని అక్కడే కూర్చున్నాడు.
మరోవైపు వినోద్ కుటుంబ సభ్యులు సైతం ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వినోద్ కు సర్ది చెప్పడంతో సెల్ టవర్ దిగాడు. దీంతో ఆందోళన కారులు కూడా తమ ఆందోళన విరమించారు.