భార్యపై అనుమానంతో నిండు జీవితానికి ముగింపు పలికాడో భర్త. తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే ఎవరితోనే చనువుగా ఉంటుందని భావించాడు. అదే వారి కాపురంలో చిచ్చురేపింది. దీంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు రాసాగాయి. మనస్తాపానికి లోనైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మహబూబ్‌నగర్‌లోని ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామంలో చోటు..
మహబూబ్ నగర్ :
భార్యపై అనుమానంతో నిండు జీవితానికి ముగింపు పలికాడో భర్త. తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే ఎవరితోనే చనువుగా ఉంటుందని భావించాడు. అదే వారి కాపురంలో చిచ్చురేపింది. దీంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు రాసాగాయి. మనస్తాపానికి లోనైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మహబూబ్‌నగర్‌లోని ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మహబూబ్‌నగర్‌లోని ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సుస్మితను కొన్నేండ్ల కిందట అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు సంతానం. భర్త ఇంటి నుంచి వెళ్లిన తర్వాత భార్య సుస్మిత తన వద్ద ఉన్న ఫోన్లో తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తితో మాట్లాడసాగింది. ఇలా గత కొద్దిరోజులుగా తరుచుగా అదే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండడంతో.. భార్య సుస్మితపై భర్త ఆనంద్‌కు అనుమానం కలిగింది. ఈ విషయమై ఆనంద్ భార్యను నిలదీశాడు. దీంతో సుస్మిత అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే భార్య ఫోన్ మాట్లాడిన వ్యక్తి వద్దకే వెళ్లిందని ఆనంద్ భావించాడు. దీంతో అతను గత శనివారం రాత్రి గులికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి దవాఖానకు తరలింయాకె. అక్కడ అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఊర్కొండ ఏఎస్సై తెలిపాడు.