ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ అంశం పోలీసులు దృష్టికి వచ్చింది. కేసును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అరెస్ట్ అయిన యువతి ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్..
డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను దూషించడమం నేరమనే విషయం తెలిసిందే. దీనికి శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని మన చట్టాలు చెబుతుంటాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఇలాగే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. విధిలో ఉన్న కండక్టర్పై ఇటీవల ఓ యువతి దుర్భాషలాడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ అంశం పోలీసులు దృష్టికి వచ్చింది. కేసును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అరెస్ట్ అయిన యువతి ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్.. ‘హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్ పేటకు చెందిన సయ్యద్ సమీనాను రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
ఇక ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించినా, దాడులకు పాల్పడినా యాజమాన్యం ఏమాత్రం సహించదని సజ్జనార్ తేల్చి చెప్పారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. 45 వేల మంది టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్ సూచించారు.