మేడిగడ్డ లో, ఎన్.డి.ఎస్.ఏ బృందం పర్యటన…

మేడిగడ్డ లో, ఎన్.డి.ఎస్.ఏ బృందం పర్యటన..

భూపాలపల్లి జిల్లా :

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం రెండో రోజు పర్యటిస్తోంది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం చేరుకుంది.

నిన్న రాత్రి రామగుండంలో బస చేసి అన్నారం బ్యారేజీకి చేరుకుని అక్కడ సీపేజీలు, బుంగలు, లీకేజీల ప్రాంతంలో పరిశీలిస్తున్నారు.

కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు యు.సి. విద్యార్థి, ఆర్. పాటేల్, సీడబ్ల్యూసీ సభ్యుడు యస్.హెచ్. శివ కుమార్, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా లు ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సభ్యులు బ్యారేజ్‌ పై నుంచి పరిశీలిస్తున్నారు..