ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన ప్రభుత్వం…

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు.

మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని గైడ్‌లైన్స్‌లో ప్రకటన.

రేషన్‌ కార్డ్‌ ఆధారంగా బీపీఎల్‌కు దిగువన ఉన్నవారు అర్హులు.

మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత.

లబ్ధిదారుడు గ్రామం, లేదా అర్బన్‌ లోకల్‌ బాడీకి చెందినవారై ఉండాలి.

అద్దెకుంటున్న వారు కూడా అర్హులే.

400SFT విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలి.

నాలుగు దశల్లో రూ.5లక్షల ఆర్థికసాయం.

బేస్‌మెంట్‌ లెవల్‌కు రూ.లక్ష.

స్లాబ్‌ లెవల్‌కు రూ.లక్ష.

స్లాబ్‌ పూర్తయిన తర్వాత రూ.2లక్షలు.

ఇల్లు పూర్తయిన తర్వాత మరో లక్ష.

నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4లక్షల 50వేల ఇళ్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం.

ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారుల ఎంపిక.

జిల్లా ఇన్‌జార్జ్‌ మంత్రి అధ్యక్షతన లబ్ధిదారులను ఫైనల్‌ చేయనున్న కలెక్టర్‌.

గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక.