మైహోమ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్..

హైదరాబాద్ :

మైహోమ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్..

ఆక్రమిత 150ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు.

మైహోమ్ సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ.

పదేళ్లుగా భారీ నిర్మాణాలు చేపట్టిన మైహోం సంస్థ.

భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధం.

మేళ్లచెరువు :

మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.గత పదేళ్లుగా మేళ్లచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని 150 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న భూదాన్ బోర్డు కార్యాలయం అక్రమార్కులకు నోటీసులు జారీ చేసింది. మేళ్లచెరువు రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో 160ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఇందులోని 113 ఎకరాల భూదాన్ భూమిని మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం, కీర్తి సిమెంట్ పరిశ్రమ 18.20ఎకరాలు, కీర్తి సిమెంట్స్ ఎండి జాస్త్రి త్రివేణి 21.20ఎకరాలు భూమిని ఆక్రమించారు.మరో ఇద్దరు రైతుల వద్ద 3.19ఎకరాల భూమి కబ్జాకు గురైంది.

ఈ భూములపై గత పదేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా మైహోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. అనేక వివాదాలు తలెత్తాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో భూదాన్ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. భూదాన్ భూముల కబ్జా వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేళ్లచెరువు గ్రామ రెవిన్యూ పరిధిని భూదాన్ భూముల ఆక్రమణ పై దృష్టి సారించింది. భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ్ దాన్ చట్టం సెక్షన్ 24A ద్వారా షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈనెల 16న సీసీఎల్ఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే భూదాన్ భూముల ఆక్రమించిన మైహోమ్ యాజమాన్యం సహా నలుగురు భూ ఆక్రమణదారులకు నోటీసులు అందజేసినట్లు మేళ్లచెరువు తహసిల్దార్ తెలిపారు.