రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు..
ఈ క్రమంలో రూ.40.08 కోట్ల విలువైన 61.08 కిలోల విదేశీ బంగారం, రూ.13 లక్షల నగదు, 17 కార్లు, 30 మొబైల్స్, 21 ఇంటర్నెట్ డాంగిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. అదే సమయంలో 12 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌ఐ పాట్నా, ముజఫర్‌పూర్, గోరఖ్‌పూర్, అస్సాం యూనిట్లు పాల్గొన్నాయి..
వాస్తవానికి గౌహతిలోని నివాస సముదాయం నుంచి బంగారం స్మగ్లింగ్ సిండికేట్(syndicate smuggling) నిర్వహిస్తున్నట్లు DRIకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అస్సాం యూనిట్ ఏజెన్సీ పలు చోట్ల సోదాలు చేయగా 22.74 కిలోల బరువున్న 137 బంగారు బిస్కెట్లు, రూ.13 లక్షల నగదు లభించాయి. అలాగే 21 వాహనాల తాళాలు, 30 మొబైల్ ఫోన్లు, 25 ఇంటర్నెట్ డాంగిల్స్ స్వాధీనం చేసుకోగా, ఆ ఇంట్లో ఆరుగురిని అరెస్టు చేశారు..