గొర్రెల కుంభకోణం కేసు… మరో ఇద్దరు ఉద్యోగుల అరెస్టు

హైదరాబాద్‌ :

గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ గుత్తేదారులతో కమ్మక్కై అక్రమాలకు పాల్పడారని దర్యాప్తులో తేలింది. రైతుల నుంచి గొర్రెలను ప్రైవేటు వ్యక్తుల సాయంతో సేకరించారని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులకు ఇవ్వాల్సిన రూ.2.10 కోట్లును గుత్తేదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి నిందితులు సహకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు………