నగరంలో పొగలేని బస్సులు మెట్రో లేని మార్గంలో పరుగులు ఆగస్టు నాటికి మరో 550 ఎలక్ట్రికల్ వాహనాలు
హైదరాబాద్ :
నగరానికి ఎట్టకేలకు కొత్త బస్సులు సమకూరాయి. 80 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులతో పాటు.. 22 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు విమానాశ్రయం మార్గంలో నడుస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
మూడు మార్గాల్లో నాన్‌ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు..
రూటు నంబరు 47 ఎల్.. సికింద్రాబాద్ – మణికొండ మధ్య పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఫిల్మ్‌నగర్ మీదుగా 12 బస్సులు ప్రతి 10 నిమిషాలకో సర్వీసు..
రూటు నంబరు 218సి పటాన్‌చెరు – సీబీఎస్ మధ్య బాలానగర్, కూకట్‌పల్లి మీదుగా 6 బస్సులు ప్రతి 15 నిమిషాలకొకటి..
రూటు నంబరు 222, పటాన్‌చెరు- కోఠి మధ్య మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్ మీదుగా 4 బస్సులు ప్రతి 20 నిమిషాలకొకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి.
గమ్యం యాప్‌కు అనుసంధానం
ప్రస్తుతం నగరంలో 150 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని.. జూన్ నాటికి 550 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు చెబుతున్నారు. వాటికి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమర్చి.. ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘గమ్యం’యాప్‌కు అనుసంధానం చేస్తామని ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు. బస్సుల గురించి సమాచారం కావాలంటే.. కోఠి, రేతిఫైల్ బస్సు స్టేషన్లలోని కమ్యూనికేషన్ సెంటర్లలోని 9959226160, 9959226154 నంబర్లలో సంప్రదించాలన్నారు.