ఆర్టీసీ బస్సులో భారీ నగదు పట్టివేత
హైదరాబాద్ :
ఎన్నికల వేళ నగదు తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ తో కలిసి అక్రమంగా తరలిస్తున్న డబ్బును ఎక్కడి కక్కడ పట్టుకుంటున్నారు.
వాహన తనిఖీలను ముమ్మ రం చేసి లక్షల, కోట్ల రూపా య లను స్వాధీనం చేసు కుంటున్నారు. తాజాగా ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 16 లక్షల 50 వేల రూపాయలతో పాటు వెండిని పట్టుకున్నారు. ఎలాంటి అధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు.
వనపర్తి నుంచి హైదరాబాద్ బస్సులో డబ్బు తరలిస్తున్న జయదేవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.