లోక్ సభ ఎన్నికలకు దూరంగా KCR కుటుంబం

లోక్ సభ ఎన్నికలకు దూరంగా KCR కుటుంబం

హైదరాబాద్ :

టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ ఎస్ ను 23 ఏళ్ల కిందట స్థాపించారు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి లోక్ సభ ఎన్నికలకు కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు తొలిసారిగా దూరంగా ఉండాలని నిర్ణయించు కున్నారు.

2004 నుంచి ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం పోటీపడింది. కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్, ఆయన మేనల్లుడు తన్నీర్ హరీశ్ రావు లోక్ సభ ఎన్నికల్లో తలపడుతారని నిన్న మొన్నటి వరకు చాలామంది ఊహాగానాలు చేశారు. అయితే వారెవరూ బరిలోకి దిగలేదు.

కెసిఆర్ కూతురు కె. కవిత 2019లో నిజామాబాద్ నుంచి లోక్ సభ స్థానానికి పోటీపడి ఓడిపోయారు. కాగా ఈ సారి ఆమె లోక్ సభ స్థానానికి పోటీవడడం లేదు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఉండిన కెసిఆర్ టిడిపికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిటి ఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చశారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని పునరు ద్ధరించారు. 2004లో కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

ఆయన 2006లో జరిగిన ఉప ఎన్నికలో, 2008 లో నూ తన స్థానాన్ని కాపాడు కున్నారు. 2009లో మహ బూబ్ నగర్ నుంచి కెసిఆర్ ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలోనే ఆయన తెలం గాణ రాష్ట్రాన్ని సాధించారు.