ACB కి రెండోసారి పట్టుబడ్డ అవినీతి పోలీస్ అధికారి

ACB కి రెండోసారి పట్టుబడ్డ అవినీతి పోలీస్ అధికారి

హైదరాబాద్ :

లంచం కోసం తిప్పలు పెడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ పై ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు.

ఇచ్చిన ఫిర్యాదు ను అనుసరించి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దారుడి దగ్గర లంచం తీసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ ని ఏసీబీ అధికారులుశనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు.

వివరాల్లోకి వెళితే….

బొడ్డుపల్లి సైదులు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఓ కేసులో నిందితుడైన మధాని సుభాష్ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకో కుండా ఉండటానికి రూ.10 వేలు లంచం తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా శనివారం పట్టుకున్నారు.

సబ్ ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేసి స్పెషల్, ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

కొసమెరుపు ఏమిటంటే రెండు సంవత్సరాల క్రితం ఈ సబ్ ఇన్స్పెక్టర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో భూమి విషయంలో లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయ్యారు…