నేటి నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 ఒకటో తరగతి అడ్మిషన్లు ప్రారంభం…

నేటి నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 ఒకటో తరగతి అడ్మిషన్లు ప్రారంభం..

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1254 కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైంది. ఒకటో తరగతికి మాత్రమే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు అనుమతిస్తున్నారు. రెండు, ఆపై తరగతుల వారికి ఆఫ్‌లైన్ విధానంలో..

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1254 కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైంది. ఒకటో తరగతికి మాత్రమే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు అనుమతిస్తున్నారు. రెండు, ఆపై తరగతుల వారికి ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్ణయించారు. ఇక ఒకటో తరగతి ప్రవేశాలు పొందగోరే చిన్నారుల వయసు మార్చి 31 నాటికి తప్పని సరిగా ఆరేళ్లు పూర్తై ఉండాలి.