విడ్డూరం…? ట్రాక్టర్ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని… పోలీసులు ఫైన్

విడ్డూరం…? ట్రాక్టర్ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని… పోలీసులు ఫైన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

పాల్వంచలో ఓ ట్రాక్టర్ డ్రైవరుకు సీటు బెల్ట్ పెట్టుకోలేదని 100 రూపాయలు ఫైన్ వేశారు పాల్వంచ పోలీసులు.

పాల్వంచ మండలం జగన్నాథ పురం కు చెందిన నాగిరెడ్డి ట్రాక్టర్ లో ఇసుక తీసుకు వస్తుండగా ఫైన్ వేశారు పోలీసులు. మార్చి 27 న పోలీసులు ఫైన్ వేయగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ నాగిరెడ్డి షాక్‌ అయ్యాడు. అతనే కాదు.. విషయం తెలిసిన చుట్టుపక్కల జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ట్రాక్టరుకు అసలు సీట్ బెల్ట్ ఎక్కడిదని ట్రాక్టర్ యజమాని వాపోతున్నాడు. ఈ విషయం. గురించి తెలుసుకోవాలని షోరూమ్ కి కూడా ఫోన్ చేసామని.. అయితే ట్రాక్టర్ కు సీటు బెల్ట్ అనేదే ఉండదని చెప్పారని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు