కొడుకు చేతిలో  మాజీ నక్సలైట్ బాలయ్య  దారుణ హత్య…!

కొడుకు చేతిలో  మాజీ నక్సలైట్ బాలయ్య  దారుణ హత్య…!

రోడ్డు పై పెట్రోల్ ఒంటిపై పోసి తగలబెట్టిన వైనం.

మృతుడు రవీందర్(బ్యాగ్ ల బాలయ్య ) ఎస్పీ వ్యాస్ హత్య లో ప్రధాన నిందితుడు.

మరణించిన బాలయ్య మాజీ నక్సలైట్ నాయిమ్ ముఖ్య అనుచరుడు.!!

చర్చనీయంగా  మారిన బాలయ్య హత్య.

నాగర్ కర్నూల్ :

మాజీ నక్సలైట్ బాలయ్య అలియాస్ రవీందర్(61) గురువారం రాత్రి  తన తనయుని చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.ఈ సంఘటన హైదరాబాద్ లో ని తుర్కంజల్ లో చోటు చేసుకుంది. ఇతను  నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.ఇతని కొల్లాపూర్ లో బ్యాగ్ ల బాలయ్య అని కూడా పిలుస్తారు.  బాలయ్య అలియాస్ రవీందర్ గత కొన్నేళ్ళ  నుంచి హైదరాబాద్ కేంద్రం గా చేసుకుని జీవిస్తు న్నారు.  అయితే, మృతుడి  పెద్ద కుమారుడు అనురాగ్ మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు అలవాటు పడి కన్న తండ్రిని బండరాలతో దారుణంగా కొట్టి చంపడమే కాక పెట్రోల్ పోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు,  బాలయ్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు అనురాగ్ ఎలాంటి పని చేయకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. తన చిన్న కుమారుడు అభిషేకు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడని తెలుస్తుంది.  పెద్ద కుమారుడు  డ్రగ్స్ కు బానీసై  విచ్చలవిడిగా తిరగడం,  తల్లితండ్రులు ఎంత చెప్పినా వినకపోవడంతో  కొడుకు తండ్రి మధ్యన గత కొన్ని రోజుల నుంచి చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.   కొడుకును మందలించిన తండ్రి పై ఆవేశం పెంచుకొని వెంటాడి కొట్టడమే కాక అనురాగ్ తన దగ్గర ఉన్న  పెట్రోల్ పోసి తగలబెట్టారు. తన తండ్రి ని  అన్న  హత్య చేసినట్లు  పోలీసులు తెలిపారు .ఈ  విషయం పట్ల అక్కడే సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర రెడ్డి సంఘటన స్థలం  చేరుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.  బ్యాగుల బాలయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.  మొత్తం మీద మాజీ నక్సలైటు నల్లమల్ల డిప్యూటీ కమాండర్ గా పనిచేసిన బ్యాగుల బాలయ్య చివరకు తన కొడుకు చేతుల్లోనే హతం కావడం పట్ల కొల్లాపూర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది,

ఎవరి బాలయ్య.!?

పెద్దకొత్తపల్లి మండలం చెన్నప్పరావు పల్లి గ్రామానికి చెందిన బ్యాగుల బాలయ్య . ఇతను ప్రాథమిక విద్య చెన్నపురావు పల్లి గ్రామం లో పూర్తి చేసారు.  మహబూబ్ నగర్ లో పది, ఇంటర్ పూర్తి చేసి డైట్ కాలేజీలో టీటీసీ చేశారు. టీటీసి చదువు వున్నప్పుడు    కళాశాల ప్రిన్సిపాల్ తో జరిగిన గొడవ కారణంగా  కళాశాలను వదిలిపెట్టి కొల్లాపూర్ పట్టణ ప్రాంతానికి చేరుకున్నారు. కొల్లాపూర్ లో ఒక చిన్నపాటి  బ్యాగులు కుట్టే వ్యాపారాన్ని మొదలుపెట్టి జీవనం సాగించే వారు. అదే క్రమంలో  బాలయ్య 1981- 82 లో రాడికల్ విద్యార్థి సంఘం నాయకులతో పరిచయం ఏర్పడిందని తెలిసింది. అప్పట్లో ఉన్న  నల్లమల్ల దళం లో సభ్యులు చేరారు.  దళం లో  అంచలంచెలుగా ఎదిగిన బాలయ్య నల్లమల దళం డిప్యూటీ కమాండర్ గా ఎదిగారు. అప్పట్లో రాష్ట్రంలో పీపుల్స్ వార్  పార్టీ పైన ప్రభుత్వం నిషేదం పెట్టింది.  అప్పటి డిజిపి వ్యాస్ నక్సలైట్ ఉద్యమాన్ని అనిచి వేతకు ఆదశాలిచ్చారు . దీంతో పీపుల్స్ వార్ పార్టీ డీజీపీ ని మట్టి పెట్టేందుకు యాక్షన్ టీమ్ ను రంగంలోకి దింపింది.  ఈ యాక్షన్ టీంలో బాలయ్య తోపాటు నయీo కూడా ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి, ఏది ఏమైనా ఎస్పీ వ్యాసం హత్య చేయాలని ప్రణాళిక రచించి ఎల్బీ స్టేడియం మైదానంలో ఉదయం వాకింగ్ చేస్తున్న ఎస్పీ వ్యాస్  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, ఈ కాల్పుల్లో ఎస్పీ వ్యాస్ అక్కడికక్కడే మృతి చెందాడు, ఎస్పీ వ్యాస్ హత్య తో  హైదరాబాద్ అంతా పోలీసు లు అలర్ట్ ప్రకటించారు, వ్యాస్ ను  హత్య చేసిన బాలయ్య, నాయిమ్ లతో పాటు మరి కొందరిని  పోలీసు లు అరెస్ట్ చేశారు. వీరిని పోలీసు లు జైలు కు తరలించారు. వీరు బేయిల్ బయటకు వచ్చి పోలీసు కోవర్ట్ లు మారారని అప్పట్లో చర్చనీయంగా మారింది. అయితే, నాయిమ్, బాలయ్యలు నక్సలైట్ లను టార్గెట్ చేసి పౌరహక్కుల సంఘం సభ్యుల,విప్లవ రచయితల, పీపుల్స్ వార్ పార్టీ సానుభూతి పరులను పోలీసు ల అండదండలతో హత్యలు చేశారని తెలుస్తుంది. గత మూడు  దశాబ్దాల కిందట.రాష్ట్రం లో   నాయిమ్, బాలయ్యల పేరు తెలియని వారు లేరనే చెప్పవచ్చు. రాష్ట్రం లో  ఎన్నో సంచలన హత్యలకు వీరు కారకులని తెలుస్తుంది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  నాయిం ను పోలీసు లు షాద్ నగర్ దగ్గర ఎన్ కౌంటర్ లో చంపి వేశారని అప్పట్లో దినపత్రిక లో వచ్చాయి. నాయిమ్ ఎన్ కౌంటర్ తో మాజీ నక్సలైట్ ల ఆగడాలకు అడ్డు కట్టపడ్డదని చెప్పవచ్చు. అప్పటి నుంచి బాలయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కొన్ని సెటిల్ మెంట్లు చేసేవారని  చెప్పుచున్నారు. ఇతనికి మొదటి, బార్య,కూతురు మరణించారు. అదే క్రమంలో పెద్ద భార్య  కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.బాలయ్య రెండో పెళ్ళి చేసుకోగా ఇద్దరు సంతానం కల్గింది. భార్య పిల్లలతో  హైదరాబాద్ లో  నివాసం ఉంటున్నాడు. పెద్ద కొడుకు మత్తు పదార్ధాలకు బానీసై జులాయిగా తిరుగుతుండగా  తండ్రి బాలయ్య మందలించడంతో తండ్రి పై గొడవలకు దిగే వాడు. ఈ గొడవ ముదిరి తండ్రి ని చంపే వరకు వచ్చింది.గురువారం రాత్రి తండ్రి తో గొడవకు దిగాడు. బాలయ్య బయపడుకోని ఇంటి నుంచి రోడ్డు పై పరుగెత్తుకుంటూ  పోవుచుండగా కొడుకు తండ్రి పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనతో  బ్యాగుల బాలయ్య  స్వగ్రామం చెన్నపురావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.