తుక్కుగూడ జన జాతర సభలో జాతీయ మేనిఫెస్టో ను విడుదల చేసిన రాహుల్ గాంధీ

తుక్కుగూడ జన జాతర సభలో జాతీయ మేనిఫెస్టో ను విడుదల చేసిన రాహుల్ గాంధీ

హైదరాబాద్ :

తుక్కుగూడ ‘జన జాతర’ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేశారు.

న్యాయపత్రం’ పేరుతో విడుదల చేసిన ఈ మేని ఫెస్టోలో ఐదు గ్యారెంటీలు ఇచ్చారు. ఐదు న్యాయసూ త్రాల్లో యువతకు శిక్షణ, మహిళల కోసం నారీ న్యాయ్, రైతుల కోసం కిసాన్ న్యాయ్, కార్మిక్ న్యాయ్, తొంబై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమ న్యాయం అందిస్తామ న్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయం లో రాష్ట్రానికి సంబంధించి న గ్యారెంటీల మేనిఫెస్టోను విడుదల చేశామని, ఇప్పు డు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి నుంచే ఆరు గ్యారెంటీలు ఇచ్చి… వాటిని అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఏ గ్యారెంటీని లేదా ఏ హామీ ని అయితే ఇచ్చామో… ఆ మాట నిలబెట్టుకున్నట్లుగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు.

తెలంగాణలో హామీలను నెరవేర్చినట్లు జాతీయ స్థాయిలో కూడా నిలబెట్టు కుంటామన్నారు. నిరుద్యోగు లకు ఉద్యోగ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ గొంతు అనుకోవద్దని… ఇది యావత్ భారత దేశం యొక్క గొంతు అన్నారు. మేనిఫెస్టోలోను ఐదు న్యాయసూత్రాలు ఐదు భారతీయ ఆత్మలు అన్నా రు. ఐదు న్యాయసూత్రా లలో మొదటిది…యువత కు శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా నిరుద్యోగు లకు రూ.1 లక్ష వేతనంతో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి… ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.తమ మేని ఫెస్టోలో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. మహిళల కోసం నారీన్యాయ్ చట్టం తీసుకు వస్తామన్నారు.

తాము ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టామ న్నారు. పేదింటి మహిళకు ఏడాదికి రూ.1 లక్ష సాయమందిస్తామన్నారు. నేరుగా మహిళల ఖాతాల్లో వీటిని జమ చేస్తామన్నారు. తద్వారా ఒక్క కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం రూ.1 లక్ష కంటే తక్కువ ఉండకుండా చూస్తామ న్నారు.

నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతుందన్నారు మూడోది కిసాన్ న్యాయ్ అని… దీంతో రైతులకు పూర్తి న్యాయం చేస్తామ న్నారు. రైతులు పండించే ఉత్పత్తులకు మద్దతు ధర చట్టబద్ధం చేస్తామన్నారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ఇస్తామన్నారు. నాలుగోది కార్మిక్ న్యాయ్ అని రాహుల్ గాంధీ ప్రకటిం చారు.

కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.400 ఉండేలా చూస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకూ వేతనం పెంచుతామన్నారు. ఐదో హామీగా… తొంభై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అత్యం త ధనికుల్లో దళితులు, ఆదివాసీలు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ సహా అన్ని వర్గాల్లో దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతోంద న్నారు.

తాము కులగణన చేయబో తున్నట్లు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తా మన్నారు. ఆర్థిక సర్వే కూడా చేయిస్తామన్నారు. ప్రజల హక్కులను తాము అమలు చేయబోతున్నట్లు చెప్పారు…..