9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన యువకుడు

9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన యువకుడు

నిజామాబాద్ జిల్లా  :

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి బాలికను ఓ యువకుడు గర్భవతి చేశాడు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో 9వ తరగతి చదువు తున్న బాలికను అదేగ్రా మానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు.

తనను రోజూ కలిసేవాడు. మాయమాటలు చెబుతూ బాలికను మెల్లిగా తనవైపు మలుచుకున్నాడు. బాలిక ను మాటలతో మభ్యపెట్టా డు. రోజూ ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు..

అయితే కొన్ని నెల తరువా త బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను కలిస్తే మళ్లీ తనను ఏం చేస్తారో అనేభయంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఏదో కోల్పోయినట్లు ఉడటంతో తల్లిదండ్రులు నిలదీశారు.

దీంతో బాలిక శనివారం అసలు విషయం చెప్పడం తో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగి పోయారు. వెంటనే పోలీస్ స్టేషన్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.