మెట్రో స్టేషన్‌లో గన్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

మెట్రో స్టేషన్‌లో గన్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

న్యూఢిల్లీ :

మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ జవాన్ తన గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది.

ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన తాజాగా చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

ఆ వీడియో జవన్ తన గన్ తో కాల్చుకుని చనిపోవడం స్పష్టంగా కనిపించింది. కాగా ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అతను మహారాష్ట్ర గడ్చిరోలి కి చెందిన CISF జవాన్ సహరే కిషోర్ గా పోలీసులు తెలిపారు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లో 2022 నుండి విధులు నిర్వహిస్తున్నారు.

సహరే కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…!