అంతర్జాతీయ వేదికపై మెరిసిన హాయ్ నాన్న… ఏకంగా 11 అవార్డులు అందుకున్న సినిమా

అంతర్జాతీయ వేదికపై మెరిసిన హాయ్ నాన్న.. ఏకంగా 11 అవార్డులు అందుకున్న సినిమా

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. తండ్రి కూతురు మధ్య ఎమోషన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శౌర్యవ్. హాయ్ నాన్న సినిమా గత ఏడాది డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శౌర్యవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. తండ్రి కూతురు మధ్య ఎమోషన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శౌర్యవ్. హాయ్ నాన్న సినిమా గత ఏడాది డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగాను నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది హాయ్ నాన్న. ఇదిలా ఉంటే ఇప్పుడు హాయ్ నాన్న సినిమాకు అవార్డుల పంట పండింది.

తాజాగా హాయ్ నాన్న సినిమా అంతర్జాతీయ వేదికపై సందడి చేసింది. న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డుల్లో హాయ్ నాన్న సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 11 విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్‌ ట్రాక్‌, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో ఇలా పదకొండు విభాగాలు హాయ్ నాన్న సినిమాకు అవార్డులు లభించాయి.

హాయ్ నాన్న సినిమాకు అవార్డులు రావడంతో దర్శకుడు శౌర్యవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి అంటే సుందరానికి అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.