హైదరాబాద్ :
మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా, మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు కేటాయించారు.
మిగతా 6 స్థానాలను ఓసీలకు కేటాయించారు. మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని మహిళా అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకు కేటాయించారు.
1. ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2. మహబూబాబాద్ (ఎస్టీ ) – మాలోత్ కవిత
3. కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4. పెద్దపల్లి(ఎస్సీ ) – కొప్పుల ఈశ్వర్
5. మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6. చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7. వరంగల్ (ఎస్సీ) – డాక్టర్ మారెపెల్లి సుధీర్ కుమార్
8. నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9. జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్ (బీసీ)
10. ఆదిలాబాద్(ఎస్టీ ) – ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11. మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12. మెదక్ – పీ వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13. నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
14. సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15. భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16. నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17. హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)