పొట్టిలంక తనిఖీ కేంద్రం వద్ద కోటి 40 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం.
తూర్పుగోదావరి జిల్లా :
రాజమండ్రి రూరల్
కడియం మండలం పొట్టిలంక 216వ నెంబర్ జాతీయ రహదారిపై సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద కడియం సిఐ బి తులసీదర్ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న విలువైన వెండి, బంగారపు వస్తువులు పట్టుబడినట్లు రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి ఎం అంబికా ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి పలు శాఖల తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వారంపై సుమారు కోటి 40 లక్షల రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులు తరలిస్తుండగా గుర్తించి సమాచారాన్ని జిల్లా ఎఫ్ఎస్టి, రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ అధికారులను ఘటనా స్థలానికి చేరుకొని తాసిల్దార్ బి రమాదేవి సమక్షంలో పత్రాలను పరిశీలించారు. తదుపరి విస్తరణ నిమిత్తం జిల్లా గ్రీవెన్స్ కమిటీకి తరలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు డిఎస్పి వెల్లడించారు.