ట్రావెల్ అలర్ట్..! ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు ఎవరూ వెళ్లొద్దు

ట్రావెల్ అలర్ట్..!

ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు ఎవరూ వెళ్లొద్దు.

భారత్ ప్రభుత్వం హెచ్చరిక.

న్యూ ఢిల్లీ :

భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్స్ ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. 2024, ఏప్రిల్ 12వ తేదీ ఈ మేరకు భారత పౌరులకు స్పష్టం చేసింది.

ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితులు బాగోలేవని.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ఎవరూ ఆ రెండు దేశాల్లో పర్యటించటం సురక్షితం కాదని.. ఆ రెండు దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో భారతీయ ఎంబసీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

ఇరాన్ లో ఇజ్రాయోల్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయులెవరూ ఇరాన్ , ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న వారందరూ అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలని కోరింది. అక్కడున్న వారు జాగ్రత్తగా
ఉండాలని కోరింది. అలాగే అక్కడ ప్రయాణాలను తగ్గించుకోవాలని..ఎప్పటి కప్పుడు అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్ ఇజ్రాయోల్ పై దాడి చేసే అవకావం ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఇజ్రాయోల్ కూడా ప్రత్యక్ష దాడులకు దిగే అవకాశం ఉంది. గాజాలో తమ భద్రతా దళాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు మరోచోట కూడా చూడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించడంతో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.