కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం

కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్ :

కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌ సికార్‌ జిల్లా ఫతేపూర్‌ షెకావతి లోని ఓ వంతెనపై ఆదివా రం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.

కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. సమా చారం మేరకు.. వంతెనపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో మంట లు చెలరేగాయి.

మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాంప్రతాప్ బిష్ణోయ్ మాట్లాడుతూ కారులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌కు చెందిన వారని తెలిపారు.

సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిసార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కారులో ప్రయాణిస్తున్న మృతుల వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫతే పూర్ షెకావతి పోలీసులు మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.