అనుమానాస్పదంగా బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య…?
సంగారెడ్డి జిల్లా :
సంగారెడ్డి జిల్లా పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో నివసిస్తున్నాడు.
అశోక్ పెద్ద కుమార్తె శివానీ (19) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. ఏం జరిగిందో తెలియదు గానీ, రెండు నెలల క్రితం శివానీ తన సొంత గ్రామం సదాశివ పేటలోని తమ ఇంటికి వచ్చింది.
వచ్చినప్పటి నుంచి మన స్తాపంతో ఉండేది. ఎవరితో నూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఈ క్రమంలో సోమ వారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసు కొని శివానీ ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లిదండ్రులు ఇంటి తలు పులు తెరచి చూడగా ఫ్యాన్‌కు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. కళ్ల ముందు ఉన్న బిడ్డ ఏం కష్టం వచ్చిందో ఇలా అర్ధాం తరంగా జీవితం ముగిం చిందో అర్ధం కాకా ఆ తల్లి దండ్రులు గుండెలవిసేలా రోధించారు.
దీనిపై సమాచారం అందు కున్న పోలీసులు సంఘట నా స్థలానికి చేరుకుని యువతి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకు న్నారు. తనకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టమని, తన తల్లిదండ్రుల అనుమతితో తన శరీరం రోని అవయవాలను దానం చేయాలని కోరుతున్నానని లెటర్‌లో పేర్కొంది.
తాను లేకున్నా తన అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారని తెల్పింది. తన చావుకు తానే కారణ మని, దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొంది.
శివానీ బ్రెయిన్ డెడ్ కావ డంతో ఆమె అవయవాలు పనికిరావని వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సీఐ మహేశ్ గౌడ్ మీడియాకు తెలిపారు..