తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు

న్యూఢిల్లీ :

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.

ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తు లుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నా రని నిర్ణయించినట్టు వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.