మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం

మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. 29 మంది లో తొమ్మిది మంది గుర్తింపు వారి పేర్లు ను అధికారికంగా వెల్లడి చేసిన..బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అడవుల్లో సోమవారం సాయంత్రం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పాటిలింగం బుధవారం (ఏప్రిల్ 17) మీడియాకువెల్లడించారు.

మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు.

కాంకేర్‌ అడవుల్లో సమావేశం అయ్యారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ యాంటీ మావోయిస్టులు పేరిట నిర్వహించారు.

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్‌ శంకర్‌రావు ఉన్నట్లు తొలుత భావించారు. అయితే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ మురళి, అలియాస్‌ శంకర్‌గా గుర్తించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది మృతుల పేర్లను మీడియాకు వెల్లడించారు. మిగతా వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించిన వారు వీరే

మావోయిస్టు పార్టీ డీకే టాప్‌ కమాండర్‌ సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ రావు

డీసీఎస్, సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ భార్య దాశశ్వర్‌ సుమన అలియాస్‌ రజిత

జన తన సర్కార్‌ కమిటీ ఇన్‌చార్జి లలిత (డీవీసీ మెంబర్) నార్త్‌ బస్తర్‌ మెంబర్‌ మాధవి పర్థాపూర్‌ ఏరియా కమిటీ జగ్ను అలియాస్‌ మాలతి పర్థాపూర్‌ ఏరియా కమిటీ మెంబర్‌ రాజు సలామ్‌ అలియాస్‌ సుఖాల్

పర్థాపూర్‌ ఏరియా కమిటీ మెంబర్‌ వెల సోను అలియాస్‌ శ్రీకాంత్‌ సోను
ప్రాగ్‌ ఎల్వోసీ కమాండర్‌ రాణిత అలియాస్‌ జయమతి (రూపి)
నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ మెంబర్‌ రామ్‌ షీలా