ఇంద్రవెల్లి మృత వీరులకు జోహార్లు…

ఇంద్రవెల్లి మృత వీరులకు జోహార్లు…

మావనాటే మావరాజ్ (మా ఊరిలో మా రాజ్యం) అంటూ ఆత్మగౌరవ పోరాటం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై

అదో హక్కుల పోరు. జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభపై ప్రభుత్వం పోలీసులను ఎగదోసింది. అడవిబిడ్డలపై తుపాకి గుళ్లు కురిపించింది. ఈ ఘటనలో వందమందికిపైగా అడవిపుత్రులు నేలకొరిగారు. వందలమంది గాయపడ్డారు. అడవి బిడ్డల నెత్తుటితో ఇంద్రవెల్లి ఎరుపెక్కింది. వారిచ్చిన స్ఫూర్తితో రైతు ఉద్యమాలు ఉవ్వెత్తుగా ఎగసిపడ్డాయి. ఇంద్రవెల్లి కాల్పల ఘటన జరిగి నేటికి 43 ఏళ్లు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి పేరు వింటేచాలు ఆదివాసీ ప్రజలు, గిరిజనుల్లో సమరోత్సాహం స్ఫురిస్తుంది. సరిగ్గా 43 ఏళ్ల క్రితం 1981వ సంవత్సరం ఏప్రిల్‌ 20న జల్‌ – జంగిల్‌– జమీన్‌ అనే నినాదంతో, అటవీభూములపై హక్కులు కల్పించాలంటూ ఆదివాసీలు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు. ఈ సభకు వేలాది సంఖ్యలో అదివాసులు తరలివచ్చారు. ప్రభుత్వం నుంచి సభకు అనుమతి లేదంటూ… సభను రద్దు చేసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయని ఆదివాసీలు సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. దీంతో వాగ్వివాదం జరిగింది. ఓ మహిళను పోలీసులు చేయిపట్టి లాగేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని ఆర్డీవోకు వివరించగా ఆయన కాల్పులకు అనుమతిచ్చారు. దీంతో పోలీసులు రెచ్చిపోయి ఆదివాసీలు, గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందమందికి పైగా అమరులయ్యారు. ఆ ప్రాంతంగా ఆదివాసీల నెత్తుటితో తడిసి ఎర్రబడింది. మరికొంతమందికి తూటాలు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. అయితే 13 మంది మాత్రమే చనిపోయారని నాటి సర్కార్‌ లెక్కలు వేసింది. కానీ అనధికారికంగా 113 మంది ఆదివాసీలు నేలకొరిగారు.

ఎన్ని ఆంక్షలు పెట్టినా,కాలు నడకనైనా ఆదివాసీల నేటికి ఈ రొజు తప్పకుండా అక్కడకి చేరుకొని నివాళులు అర్పించడం వాళ్ళ సాహసానికి నిదర్శనం.

జోహార్ ఇంద్రవెల్లి మృత వీరులకు జోహార్ జోహార్.