ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా
హైదరాబాద్ :
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్స రంలో 4,78,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,87,261 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇందులో 2,41,682 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,190 (68.35 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,37, 041,మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,22,071 (51.50 శాతం) మంది పాసయ్యారు.
అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభా గంలో 4,30,413 మంది పరీక్షలు రాస్తే, 2,62,829 (61.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇందులో 2,17,716 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 (68.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,12 ,697 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,13, 498,(53.36 శాతం) మంది పాసయ్యారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 48,310 మంది పరీక్ష రాస్తే, 24,432 (50.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధిం చారు. ఇందులో 23,966 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 15,859 (66.17 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.
24,344 మంది అబ్బాయి లు పరీక్షలు రాస్తే, 8,573 (35.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయి లు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బా యిల కంటే అమ్మా యిలు 16.43 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు.
ఇంటర్ ద్వితీయ సంవత్స రం జనరల్ విభాగంలో 4,01,445 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,78,856 (69.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,05,381 మంది అమ్మా యిలు పరీక్షలు రాయగా, 1,55,500 (75.71 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేష నల్ జనరల్ విభాగంలో 42,723 మంది పరీక్షలు రాస్తే, 27,287 (63.86 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు.
ఇందులో 21,853 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 17,327 (79.28 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 20,870 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 9,960 (47.72 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణా ధికారి (సీవోఈ) జయప్రద బాయి, జాయింట్ సెక్రెటరీ వై శ్రీనివాస్, సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు…